నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) ప్రతిపాదిత ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో ప్రధాన వాటాదారులు తమ షేర్లను విక్రయిస్తున్నారు.
న్యూ ఇండియా అష్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు 32 పైసలకు కొనుగోలు చేసిన షేర్లను రూ.1785కు విక్రయిస్తూ 5,57,712 శాతం లాభం అందుకోనున్నాయి.
ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఈనెల 17 నుంచి ప్రారంభంకానుండగా, ఎస్‌బీఐ మరియు ఎల్ఐసీ వంటి ప్రముఖ సంస్థలకు సైతం భారీ రిటర్న్స్ రానున్నాయి.