
హైదరాబాద్ జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీలో డైరెక్టర్ అడ్మిషన్స్గా పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎం. సీతారామలక్ష్మిని తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేసింది.
విద్యార్థుల ప్రతిభను గుర్తించి బోధించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత ఏఐ యుగంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని విభాగాల్లో ఏఐ సబ్జెక్టులను ప్రోత్సహించడం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు.