
బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో వాయుగుండంగా మారి, ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
సోమవారం నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని, ఇప్పటికే వెళ్లిన వారు ఆదివారం లోపు తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
శుక్రవారం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు మరియు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది.