
దస్త్రాలను పెండింగ్లో ఉంచడం అంటే రాష్ట్రాభివృద్ధిని ఆపడమేనని సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు.
ప్రజల ఫిర్యాదులను పరిష్కరించకుండా తాత్సారం చేస్తే వారికి జరగాల్సిన న్యాయాన్ని పెండింగ్లో పెట్టినట్లేనని ఆయన స్పష్టం చేశారు.
ఎనిమిదవ జిల్లా కలెక్టర్ల సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.