
గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో 40 ఏళ్ల పారా అథ్లెట్ షర్మిలా ధన్కర్ మహిళల షాట్‌పుట్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది.
షర్మిల ఇనుపగుండును 9.81 మీటర్ల దూరం విసిరి, కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పసిడి పతకం గెలిచిన మొట్టమొదటి భారతీయ పారా అథ్లెట్‌గా నిలిచింది.
పేదరికంతో పోరాడుతూ ఈ ఘనత సాధించిన షర్మిల, చేతిలో మువ్వన్నెల జెండాతో యావత్ భారతం గర్వపడేలా చేసింది.