
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియపై ఎన్నికల సంఘం కమిషనర్లు సంయుక్తంగా ఇచ్చిన ప్రకటన అన్ని రకాల అపోహలను తొలగించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తో పాటు ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్.సంధూ, వివేక్ జోషి ఈ సంయుక్త ప్రకటనను విడుదల చేశారు.
ఈ అధికారిక ప్రకటన ద్వారా ఎన్నికల ప్రక్రియ పట్ల ప్రజల్లో నెలకొన్న సందేహాలకు తెరపడినట్లయింది.