
ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
పార్టీలో క్రమశిక్షణ చర్యలు, కొండా సురేఖ, చిన్నారెడ్డిలకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.