చేపలు, గుడ్లు, చికెన్ వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి.
నారింజ, నిమ్మ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు మరియు క్యాప్సికంలో ఉండే విటమిన్ సి చర్మ సౌందర్యానికి, కొల్లాజెన్ పెంపునకు తోడ్పడతాయి.
వెల్లుల్లి, టమాటాలు, ఆకుకూరలు మరియు వివిధ రకాల బెర్రీలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, ముడతలు తగ్గించడంలో సహాయపడతాయి.