ఫ్రాన్స్ మరియు స్పెయిన్ సరిహద్దుల్లో చెలరేగిన భారీ కార్చిచ్చు వల్ల వేలాది ఎకరాల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైంది.
ఫ్రాన్స్‌లో 420 చదరపు కిలోమీటర్లు, స్పెయిన్‌లో 1,25,000 ఎకరాలకు పైగా అడవులు కాలిపోగా, గిరాండ్ ప్రాంతంలో 240కి పైగా విలాసవంతమైన ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఈ అగ్నిప్రమాదం వల్ల స్థానిక వైన్ పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.