ఇన్ఫోసిస్ సంస్థ ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి ఉద్యోగులకు సగటున 70 శాతం వేరియబుల్ పే (పెర్ఫామెన్స్ లింక్డ్ బోనస్) చెల్లించింది.
గతేడాది ఇదే కాలంలో 80 శాతం బోనస్ అందగా, ఈసారి 10 శాతం కోత పడిందని, ఉద్యోగ స్థాయిని బట్టి 65 నుంచి 80 శాతం వరకు బోనస్ అందినట్లు సమాచారం.
కంపెనీ నికర లాభం 12 శాతం పెరిగి రూ. 7,769 కోట్లుగా నమోదైనప్పటికీ, వార్షిక వృద్ధి అంచనాలను తగ్గించడం వల్ల ఈ బోనస్ కోత విధించినట్లు తెలుస్తోంది.