బియ్యం ధరలను నియంత్రించేందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖ ఆరు రకాల సన్నబియ్యానికి గరిష్ఠ విక్రయ ధరలను ఖరారు చేసింది.
మార్కెట్లో హెచ్ ఎంటీ కిలో రూ.79, ఆర్ ఎన్ ఆర్ కిలో రూ.74, బీపీటీ రకం కిలో రూ.66 చొప్పున విక్రయించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.