
హైదరాబాద్ పోక్సో ప్రత్యేక కోర్టు బాలికల అక్రమ రవాణా, లైంగిక దోపిడీ కేసులో 33 మందిని దోషులుగా నిర్ధారిస్తూ బుధవారం తీర్పు వెలువరించింది.
ఈ కేసులో ఐదుగురికి జీవిత ఖైదు, ముగ్గురికి 14 ఏళ్లు, 14 మందికి 10 ఏళ్లు, 11 మందికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షలు పడ్డాయి.
బాధిత తొమ్మిది మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 45 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.