
అమెరికా సెనెట్, నాసా, ఫెడరల్ రిజర్వ్ వంటి కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకున్న చైనా హ్యాకర్ల సైబర్ దాడుల కుట్రను అధికారులు భగ్నం చేశారు.
చైనాకు చెందిన నాన్జింగ్ జిన్జియువీ నెట్‌వర్క్ టెక్నాలజీ కంపెనీ ఈ దాడుల వెనుక ఉందని అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఆరోపించింది.
2018 నుండి కొనసాగుతున్న ఈ హ్యాకింగ్ ప్రయత్నాల్లో భాగంగా క్యూస్కాన్, క్యూటీరూటర్ అనే రెండు హ్యాకింగ్ ప్లాట్‌ఫామ్‌ల డొమైన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.