
వైకాపా నేతలతో కలిసి వేదికను పంచుకున్న తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బొండా ఉమా నుంచి వెంటనే వివరణ కోరాలని ఆదేశించారు.
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు భావిస్తున్న ఈ వ్యవహారంపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.