
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి వైదొలిగే వరకు యుద్ధాన్ని పొడిగించే అవకాశం ఉందని ఇరాన్ ఐఆర్జీసీ కమాండర్ సలహాదారు మహమ్మద్ రెజా నఖ్దీ హెచ్చరించారు.
ప్రస్తుతం యుద్ధంలో తాము గెలుస్తున్నామని, అమెరికా సైన్యం భావించిన దానికంటే బలహీనంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
క్షిపణుల నిల్వలు అయిపోయినా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఆర్థిక ప్రయోజనాలను నాశనం చేయడం ద్వారా మరింత ప్రమాదకరంగా మారుతామని ఆయన వ్యాఖ్యానించారు.