
దేశ భవిష్యత్తుకు సెమీకండక్టర్లు అత్యంత కీలకం కానున్నాయని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
దేశంలో ప్రతిభావంతుల లభ్యత, భారీ దేశీయ మార్కెట్ అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ భాగస్వామ్యాల రీత్యా ప్రపంచ సరఫరా వ్యవస్థలో మన దేశం ముఖ్య కేంద్రంగా అవతరిస్తుందని చెప్పారు.