
ప్రధాని మోదీ సెప్టెంబరు 1న విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం 69 మంది మంత్రులు ఉండగా, 70 ఏళ్లు దాటిన 12 మందికి పైగా మంత్రులను తప్పించి యువతకు అవకాశం కల్పించే యోచనలో ప్రధాని ఉన్నారు.
ఈ మార్పుల్లో భాగంగా మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి, కిషన్ రెడ్డికి బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యత్వం దక్కే అవకాశం ఉంది.