
పంజాబ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వన్డే టోర్నమెంట్‌లో అమృతసర్ తరఫున ఆడిన అభిషేక్ శర్మ 91 బంతుల్లో 233 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ 25 సిక్సర్లు, 15 ఫోర్లు బాదగా, అమృతసర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 533 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఈ భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన తరణ్ తారన్ జట్టు 313 పరుగులకే పరిమితం కావడంతో అమృతసర్ 220 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.