
భారత్‌తో జరిగిన టీ20 ఆసియా కప్ మ్యాచ్‌లో షఫాలీ వర్మను ఔట్ చేసిన తర్వాత అనుచితంగా ప్రవర్తించినందుకు పాక్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ జరిమానా విధించింది.
ఆమె మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను జత చేయగా, గత 24 నెలల్లో ఆమెకు ఇది రెండో డీమెరిట్ పాయింట్.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ఉల్లంఘన కింద ఈ చర్య తీసుకున్నట్లు మ్యాచ్ రిఫరీ సుప్రియారాణి దాస్ ధ్రువీకరించారు.