
భారత వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్లో ఆడి భారత్కు కప్ అందించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
జియోహాట్స్టార్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పని ఇంకా పూర్తి కాలేదని, 2027 వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపారు.
2027 వన్డే ప్రపంచ కప్ సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 మధ్య జరగనుంది.