
కూకట్పల్లి జేఎన్టీయూ హాస్టల్లో జరిగిన ఘర్షణకు సంబంధించి 8 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గురువారం మొదలైన ఈ గొడవ అర్ధరాత్రి 2:30 గంటలకు తీవ్రరూపం దాల్చడంతో ఒక విద్యార్థికి గాయాలయ్యాయని డీసీపీ రితిరాజ్ తెలిపారు.
మద్యం మత్తులో ఉన్న విద్యార్థులపై కేసు నమోదు చేసి, కాలేజీ ప్రిన్సిపాల్ మరియు వార్డెన్‌తో చర్చలు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.