
సంజయ్ బంగర్ కుమార్తె, ట్రాన్స్‌జెండర్ క్రికెటర్ అనన్య బంగర్‌కు ఆస్ట్రేలియాలో కమ్యూనిటీ క్రికెట్ ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) అనుమతి మంజూరు చేసింది.
ఈ నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజాన్ కాప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇది అసంబద్ధమని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.
అనన్య మార్చి 2027 వరకు ఆస్ట్రేలియాలో ఆడే అవకాశం ఉండగా, ఎలైట్ స్థాయికి వెళ్లాలంటే టెస్టోస్టెరాన్ స్థాయి 10 nmol/L కంటే తక్కువగా ఉండాలనే నిబంధనను పాటించాలి.