
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను శంకరపట్నం మండల కేంద్రంలో జనసేన పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించాయి.
పార్టీ నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేయడంతో పాటు పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు సైకిళ్లు, క్రీడా దుస్తులు, పుస్తకాలను పంపిణీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.