
యెమెన్ హౌతీ తిరుగుబాటుదారుల డ్రోన్, క్షిపణి దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో భద్రతా ఆందోళనలు తీవ్రమయ్యాయి.
అక్టోబర్ 10న రియాద్‌లోని కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఒక భారతీయుడు మరణించడంతో పాటు పలువురు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జారీ చేసిన అత్యవసర మార్గదర్శకాలను పాటించాలని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి భారతీయులకు సూచించింది.