
పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 110వ జయంతి సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ పార్క్లో నిర్వహించిన ఆధునిక భజన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో ముందువరుసలో కూర్చున్న మోదీ, శ్రీరాముడిపై ఆలపించిన భజనకు ఖంజరీ తరహా వాయిద్యాన్ని వాయిస్తూ తాళం వేశారు.
సంప్రదాయ భక్తి గీతాలకు ఆధునిక సంగీతాన్ని జోడించి నిర్వహించే ఈ భజన్ క్లబ్బింగ్పై ఆయన ఎక్స్ వేదికగా అద్భుతం అంటూ ట్వీట్ చేశారు.