
కృష్ణా, గోదావరి నదులు జలకళ సంతరించుకోవాలని కోరుతూ నాగార్జునసాగర్ విజయ విహార్ వద్ద సోమవారం ఉదయం వరుణ యాగం ప్రారంభమైంది.
యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దంపతులు ఈ పూజలను ప్రారంభించగా, మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణాహుతిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.