
గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో నాలాపై నిర్మించిన జీ ప్లస్ 6 అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటనపై హైడ్రా చర్యలు చేపట్టింది.
ఈ అక్రమ నిర్మాణానికి బాధ్యుడైన బిల్డర్ ఎం.డి. సాజిద్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేయగా, నిబంధనలు పాటించని టీపీబీఓ యు. సంతోష్ కుమార్‌ను కమిషనర్ సృజన సస్పెండ్ చేశారు.
ప్రమాదకరంగా ఉన్న మరికొన్ని భవనాలను గుర్తించిన అధికారులు, సీఎంసీ నివేదిక ఆధారంగా అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియను కొనసాగిస్తున్నారు.