
అమెరికాలోని మాస్ జనరల్ బ్రిగ్హామ్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు 'FAHR-Face' పేరుతో కొత్త ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేశారు.
సుమారు 40 మిలియన్లకు పైగా ముఖ చిత్రాలతో శిక్షణ పొందిన ఈ టూల్, క్యాన్సర్ రోగుల జీవసంబంధ వయస్సును మరియు మనుగడ అవకాశాలను అంచనా వేయగలదు.
రేడియోథెరపీ పొందిన 38,000 మందికి పైగా రోగులపై పరీక్షించగా, జీవసంబంధ వయస్సు అసలు వయస్సు కంటే ఐదేళ్లు ఎక్కువగా ఉంటే మరణించే ముప్పు 21 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.