
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రోజుల్లో తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి.
ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ప్రజలు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యే అవకాశం ఉంది.