హెచ్‌ఐవీతో జీవిస్తున్న యువతలో ప్రతి ఎనిమిది వారాలకు ఒకసారి ఇచ్చే యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్‌టీ) ఇంజెక్షన్లు రోజూ వేసుకునే గోలీల కంటే మెరుగైన ఫలితాలు ఇస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది.
యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు ఆఫ్రికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్‌లో ఈ విషయం వెల్లడైంది.
ఈ పరిశోధన వివరాలు ప్రఖ్యాత ‘ది లాన్సెట్’ వైద్య జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.