
వైట్ హౌస్ ప్రతినిధి క్రిస్టెన్ హోమ్స్ అడిగిన ప్రశ్నలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమెను 'ఫేక్ రిపోర్టర్' అని విమర్శించారు.
ఉత్తర కొరియాకు సంబంధించిన ప్రశ్న అడిగినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలని ట్రంప్ ఆమెను పలుమార్లు అడ్డుకున్నారు.
జర్నలిస్టులపై వ్యక్తిగత దాడులు చేయడం అధ్యక్ష పదవికి తగదని సీఎన్ఎన్ సంస్థ ట్రంప్ తీరును ఖండించింది.