
ఆసియా క్రీడల పురుషుల క్రికెట్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దయింది.
టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టు నిబంధనల ప్రకారం నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
పాకిస్తాన్, హాంగ్‌కాంగ్ మధ్య జరగాల్సిన మరో క్వార్టర్ ఫైనల్ కూడా వర్షం వల్ల రద్దు కావడంతో మెరుగైన సీడింగ్ ఆధారంగా పాక్ సెమీస్‌లోకి ప్రవేశించింది.