క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌లో పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించిన సైబర్ కేటుగాళ్ల చేతిలో పడి ఒక మహిళ రూ.6 లక్షలు నష్టపోయింది.
ఆన్లైన్ ట్రేడింగ్ యాప్ ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆశ చూపించి నిందితులు విడతల వారీగా ఆమె నుండి నగదు బదిలీ చేయించుకున్నారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, సదరు బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.