
పెదబయలు మండలం వన్నాడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు నవీన్ కుమార్, గ్రామస్థుల సహకారంతో పాఠశాల రూపురేఖలు మార్చి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.
గోపాలపట్నం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.నాగ వెంకట సత్యనారాయణ సొంత నిధులతో విద్యార్థుల కోసం ఆటో సౌకర్యం కల్పించి, పలు వసతులు సమకూర్చారు.
జి.మాడుగుల మండలం వంతాల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయురాలు కల్యాణికుమారి, గణితాన్ని ఆటపాటలతో బోధిస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.