
రాబోయే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలిస్తే, ప్రతి వయోజన అమెరికా పౌరుడికి 5,000 డాలర్ల చొప్పున 'ట్రంప్ డివిడెండ్' ఇస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు.
అమెరికాలో ఉన్న సుమారు 27 కోట్ల మంది వయోజనులకు ఈ నగదు పంపిణీ చేయాలంటే ప్రభుత్వానికి 1.35 ట్రిలియన్ డాలర్ల భారం పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ హామీపై ఆర్థిక నిపుణులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తూ, ఇది ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇస్తున్న లంచమని, దీనివల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.