
అమెరికాలో వీసా గడువు పెంపు, కేటగిరీ మార్పు కోసం ఉపయోగించే ఫారమ్ I-539, I-765లలో సెప్టెంబర్ 15, 2026 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
సెప్టెంబర్ 15 లేదా ఆ తర్వాత పాత వెర్షన్ ఫారమ్‌లను సమర్పిస్తే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే దరఖాస్తులను అధికారులు తిరస్కరిస్తారు.
అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థులు, ఐటీ నిపుణులు దరఖాస్తు చేసేటప్పుడు ఫారమ్ అడుగున ఉన్న ఎడిషన్ డేట్‌ను కచ్చితంగా సరిచూసుకోవాలని యూఎస్సీఐఎస్ హెచ్చరించింది.