
పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు-పీటీపల్లి నడుమ 132 కేవీ హైటెన్షన్ విద్యుత్తు లైన్ ఎత్తు తగ్గిపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది.
కాల్వ మట్టిని లైను కింద పోయడంతో గ్రౌండ్ క్లియరెన్స్ 6.1 మీటర్ల నుంచి 3.5 మీటర్లకు పడిపోయింది.
అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2022లో హైటెన్షన్ వైరు తగిలి ఓ రైతు మృతి చెందగా, నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు రూ.కోటిన్నరతో టెండరు పిలిచారు.