
చిన్నారుల ఆహారంలో కేలరీలు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆ పాలు అన్ని విధాలా మంచివని భావించడం పొరపాటని, పిల్లల వయస్సు, జీర్ణశక్తిని బట్టి ఎంచుకోవాలని డాక్టర్ కె. రావణ స్పష్టం చేశారు.
ఆవు పాలలో కొవ్వు తక్కువగా ఉండి తేలికగా జీర్ణమవుతుండగా, గేదె పాలలో రెట్టింపు కొవ్వు, ప్రొటీన్ మరియు కాల్షియం అధికంగా ఉంటాయని తెలిపారు.
ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే అమృతమని, ఏడాది లోపు పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవు లేదా బర్రె పాలను తాగించకూడదని హెచ్చరించారు.