ఒంగోలు రాజకీయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ మధ్య జరుగుతున్న వ్యక్తిగత విమర్శలపై టీడీపీ, జనసేన అధిష్టానాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కూటమికి నష్టం కలిగించేలా వ్యవహరించవద్దని, సంయమనం పాటించాలని ఇరు పార్టీల సమన్వయ కమిటీ నేతలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ హయాంలో అక్రమాలపై కాణిపాకంలో ప్రమాణం చేయాలన్న సవాల్‌తో మొదలైన ఈ వివాదంపై అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఫోన్ ద్వారా చర్చించారు.