
హోర్ముజ్ జలసంధిలో నిబంధనలు పాటించని విదేశీ నౌకల సరుకును జప్తు చేయడం లేదా 20 శాతం వరకు జరిమానా విధించే ప్రతిపాదిత బిల్లుకు ఇరాన్ పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపింది.
ఈ ఉల్లంఘనలపై విచారణ జరిపేందుకు అంతర్జాతీయ సముద్ర చట్టాలపై పట్టున్న న్యాయమూర్తులతో ప్రత్యేక కోర్టు బెంచ్‌లను ఇరాన్ న్యాయశాఖ ఏర్పాటు చేయనుంది.
ఐరాస వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు చేయగా, ఇరాన్ ప్రతినిధి బృందం నిరసనగా సభ నుంచి వాకౌట్ చేసింది.