
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన దాదాపు 3.75 లక్షల మంది కస్టమర్ల రహస్య డేటాను 'సిరియూసిమ్' అనే హ్యాకర్ గ్రూప్ దొంగిలించినట్లు సైబర్ సెక్యూరిటీ అకౌంట్ 'సైబర్పల్స్56' ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఈ హ్యాకర్ల వద్ద 3.75 లక్షల అకౌంట్ల వివరాలతో పాటు 2,722 పీడీఎఫ్ ఫైల్స్ ఉన్నాయని, ఇందులో ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం, లోన్ అప్లికేషన్లు, అడ్రస్లు ఉన్నట్లు సమాచారం.
ఈ భారీ డేటా లీక్పై దేశవ్యాప్తంగా కలకలం రేగుతున్నప్పటికీ, ఇప్పటివరకు ఎస్బీఐ వర్గాల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.