
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా బద్నావర్-ఉజ్జయిన్ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం కారు, లారీని ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
బాధితులంతా గుజరాత్‌లోని వడోదరకు చెందిన వారని, ఉజ్జయిన్ మహాకాలేశ్వర ఆలయాన్ని సందర్శించి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ పరుల్ బేలాపుర్కర్ వెల్లడించారు.