
కోనసీమ జిల్లా అల్లవరం మండలం నుంచి ఆగస్టు 3న చేపల వేటకు వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకారుల బోటు గల్లంతవ్వడంతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఆగస్టు 12 నాటికి బోటు తిరిగి రావాల్సి ఉండగా, ఆచూకీ లభించకపోవడంతో కోస్ట్‌గార్డ్ నౌకల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపును ముమ్మరం చేయాలని సీఎం అధికారులను ఆదేశించి, బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు.