
ముంబై సమీపంలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన ఓ కస్టమర్ వండుకుంటున్న మ్యాగీ నూడుల్స్లో పురుగులు, లార్వాలు కనిపించాయని ఆరోపించారు.
ఈ ఘటనపై మీడియా ద్వారా సమాచారం అందిందని, ఇప్పటివరకు కస్టమర్ గానీ అధికారులు గానీ తమను సంప్రదించలేదని నెస్లే ఇండియా స్పష్టం చేసింది.
ముడి పదార్థాల సేకరణ నుంచి ఫైనల్ ప్రాడక్ట్ వరకు అన్ని దశల్లో కఠినమైన నాణ్యత, భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు నెస్లే తెలిపింది.