
ధర్మవరంలో రూ.40 కోట్లతో మెగా చేనేత క్లస్టర్ మరియు వీవర్స్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
నేతన్న సేవా పథకం ద్వారా అర్హులైన కార్మికుల ఖాతాల్లో రూ. 25 వేల చొప్పున జమ చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ధర్మవరం పట్టుచీరలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.