
ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ తమ సేవింగ్స్ ఖాతాల సేవా రుసుములను పెంచాలని నిర్ణయించింది.
ఈ కొత్త నిబంధనలు వచ్చే డిసెంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
కొత్త విధానం ప్రకారం వినియోగదారులు ప్రతి నెలా మూడు ఉచిత నగదు డిపాజిట్లు, మూడు ఉచిత నగదు ఉపసంహరణలు పొందవచ్చు.