
టెక్ దిగ్గజం యాపిల్ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 109.4 బిలియన్ డాలర్ల రికార్డు ఆదాయాన్ని నమోదు చేసి, గతేడాది కంటే 16 శాతం లాభాన్ని పెంచుకుంది.
ఐఫోన్ అమ్మకాలు 22 శాతం పెరిగి 54.25 బిలియన్ డాలర్లకు, మ్యాక్ విక్రయాలు 29 శాతం వృద్ధితో 10.35 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని సీఎఫ్‌వో కేవన్ పరేఖ్ తెలిపారు.
సెప్టెంబర్ 1 నుంచి జాన్ టెర్నస్ కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనుండగా, మెమొరీ చిప్ ధరల పెరుగుదల వ్యాపారానికి రిస్క్‌గా మారవచ్చని ప్రస్తుత సీఈవో టిమ్ కుక్ హెచ్చరించారు.