
దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి 'ఇంజి వెల్లం' (అల్లం బెల్లం) అనే టైటిల్ను చిత్రబృందం సోమవారం ఖరారు చేసింది.
సాయిపల్లవి, విజయ్ సేతుపతి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
కోల్కతా నేపథ్యంలో రూపొందుతున్న ఈ ఆధునిక ప్రేమకథా చిత్రం వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.