
రోజంతా ఇంటి పట్టునే గదులకే పరిమితమై ఉండటం శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఉదయం పూట ఎండ తగలకపోవడం వల్ల శరీరంలో విటమిన్-డి లోపం ఏర్పడి ఎముకల బలం తగ్గడంతో పాటు కీళ్ల నొప్పులు వస్తాయి.
సూర్యకాంతి తగలకపోవడం వల్ల మెదడులో హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతిని నిద్రలేమి, మానసిక కుంగుబాటు వంటి సమస్యలు తలెత్తుతాయని తెలిపారు.