
రాజకీయ నాయకుల నుంచి రహస్య సమాచారం సేకరించేందుకు ప్లాన్ చేసిన ఉగ్రకుట్రను పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ భగ్నం చేసింది.
ఈ కేసులో ఝార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌కు చెందిన అర్పిత సర్కార్ అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంతకుముందు అరెస్ట్ అయిన హమీమ్ మోండల్ విచారణలో అర్పిత పేరు బయటపడటంతో, ఆమె ఉగ్రదాడుల ప్రణాళికలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.